తేది: ఆగస్టు 30, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(పరమ పతివ్రతా మతల్లి యైన సతీ సుమతి, వేశ్యాలోలుఁడైన తన మగని కోరిక ననుసరించి, యతనిని వేశ్యచెంతకుం బంపుట)
పతికి నమస్కరింపఁ బతి పాదములంటి పతివ్రతా విధుల్
సతతముఁ జేయు నా సుమతి; సానిని, శుండను, సర్వవల్లభన్
మతినిఁ దలంచి కోరు పతి మానసమున్ గ్రహియించి, వేగమే
హితముఁ గనంగఁ బ్రాణవిభు నింతియె పంపెను వేశ్య చెంతకున్!
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదములు శంకరయ్యగారూ! బహుకాల దర్శనము. మీరు రావడము, వ్యాఖ్య పెట్టడము నా అదృష్టము. ఇలా తఱచుగ వీక్షించి, మీ యభిప్రాయమును దెలుపుచుండఁగలరు.
రిప్లయితొలగించండి