విష్ణువుం జేరఁ ద్వరపడె! ప్రేమ వీడి,
వైరమును బూనె! పలుమఱు వైష్ణవులను
బాధపెట్టె! సీతను దెచ్చె! వైరులైన
రామభక్తులలో మేటి రావణుండు!! (1)
తల్లి పనుపున శివునికై తపము సేసి,
యాత్మలింగమ్ము కొఱకు దేహమును మిగులఁ
జిదుపలుగఁ జేసి, గెలిచిన శివమతాభి
రామ భక్తులలో మేటి రావణుండు! (2)
తల్లి యాత్మలింగముఁ గోరఁ దపము సేసి,
తనువు ఖండించుకొని, రజతాద్రి నెత్తి,
శంకరుని గెల్చుకొనె, గిరిజా మనోభి
రామ భక్తులలో మేటి, రావణుండు! (3)
వైర ప్రక్రియా సామగ్రి వలచి బోరి నాటి శిశుపాలు డీతని నంటి నడచె
రిప్లయితొలగించండిప్రక్క త్రోవలు భక్తికి బహు సులభులె!
రామ భక్తులలో మేటి రావణుండు
Sir,this is from Pitta Satyanarayana