Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 24, 2013

సమస్య: మురళీ గానమ్ము మరణమును గలిగించున్

ధరనుండి ముక్తిఁ గొనియెడి
తరుణ మ్మాసన్నమైన దానవ తతికిన్
నరుఁడైన బాలకృష్ణుని
మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

2 కామెంట్‌లు:

  1. మీ పూరణ చాలా బాగుంది. మీ బ్లాగును కూడలి, మాలిక, హారం తదితర అగ్రిగేటర్లలో చేర్చితే చాలామంది చూసి స్పందించే అవకాశం ఉంది.
    `కూడలి’లో చేర్చాలంటే....
    koodali.org ఓపెన్ చెయ్యండి. దానిలో పైన కుడిభాగాన ‘కొత్తబ్లాగు చేర్చండి’ అని ఉంటుంది. దానిని క్లిక్ చేసి, వివరాలు తెలుసుకోండి. అందులో ఇచ్చిన విధంగా support@koodali.org కి మెయిల్ పెట్టి మీ బ్లాగును కూడలిలో చేర్చవలసిందిగా విన్నపం చేస్తూ మీ బ్లాగు url అంటే madhurakavanam.blogspot.in తెలియజేయండి.
    ‘మాలిక’లో చేర్చాలంటే....
    maalika.org ఓపెన్ చెయ్యండి. దానిపైన కుడివైపున ‘మీ బ్లాగును చేర్చండి’ అన్నదాన్ని క్లిక్ చెయ్యండి. అక్కడ ఇచ్చిన వివరాల ప్రకారం కొనసాగించండి.
    ‘జల్లెడ’లో చేర్చాలంటే....
    http://www.jalleda.com ఓపెన్ చెయ్యండి. ఎడమవైపున క్రింది వైపున ‘మీ బ్లాగును కలపండి’ అన్నదానిని క్లిక్ చెయ్యండి. కనిపించిన ఫారంలో సైటు పేరు అన్నచోట మధురకవనం అని తెలుగులో టైప్ చెయ్యండి. సైటు url అన్నచోట madhurakavanam.blogspot.in అని టైప్ చెయ్యండి. వివరణాత్మక వర్ణన అన్నచోట మీ బ్లాగు గురించిన పరిచయాన్ని తెలుగులో టైప్ చెయ్యండి. ఇంకా క్రింది వివరాలను టైప్ చెయ్యండి. సైట్ ను సమర్పించండి అన్నదాన్ని క్లిక్ చెయ్యండి.
    ‘హారం’లో చేర్చాలంటే...
    http://haaram.com ఓపెన్ చెయ్యండి. కుడివైపున పైన తెలుగు అన్నదానిని క్లిక్ చెయ్యండి. వచ్చిన పేజీలో పైన కుడివైపు ‘హారంలో చేరండి’ అన్నదానిని క్లిక్ చెయ్యండి. వచ్చిన ఫారాన్ని నింపి సబ్మిట్ చెయ్యండి.
    అంతే. మీ బ్లాగు అందరి దృష్టిలో పడుతుంది. చూస్తారు. స్పందిస్తారు.
    ఇంకా ఏమైన సందేహాలుంటే ఫోన్ చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి...మీరు ఎంతో వివరంగా తెలిపిన అంశాలను చూశాను. చాలా సంతోషం కలిగింది. తమరు సూచించిన విధంగా ఈ బ్లాగును అగ్రిగేటర్లలో చేర్చడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫోన్ చేస్తాను. ధన్యవాదాలతో....

    రిప్లయితొలగించండి