Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 16, 2014

సమస్య: పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు

తేది: జులై 13, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



ఉవిద ముఖపద్మమునను నీలోత్పలములు
సూర్యచంద్రులు లేకయే చోద్యముగను
వికసనమునందెఁ గవులార వేగిరముగఁ
బూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు!

2 కామెంట్‌లు:

  1. కనులందు కలువలు ,చెక్కిళ్ళను మంకెన్నలు
    నాసిక పై సంపెంగలు,అధరమున మందారములు
    చుబుకమున చేమంతులు, మోమంతయు విరుల కాంతులు
    నిండిన ఓ బేలా!నీ పేరేనా పూబాల!!
    ........నాగ త్రినాథ్ యడవిల్లి,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగ త్రినాథ్‍గారూ, మీరు ఎంచక్కా పద్యాలు రాయవచ్చుగదా! వర్ణన బాగున్నది. అభినందనలు!

      తొలగించండి