తేది: సెప్టెంబర్ 18, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన "కురునృప పాండునందను లకుంఠిత..." అను పోతన భాగవతం లోని (3-98) పద్య ప్రారంభమును కొనసాగిస్తూ నచ్చిన అంశముతో పద్యమును వ్రాయుమనగా నేను వ్రాసిన రెండు పద్యములు
(1)
కురునృప! పాండునందను లకుంఠిత శౌర్య సుధీ బలాఢ్యులై
నిరుపమ యుద్ధనైపుణిని నీదు సుత ప్రకరమ్ములన్ వడిన్
గరము దురంత దుఃఖ మిడు కయ్యము నందునఁ గూల్చుచుండఁగన్
ద్వరితగతిన్ యమున్ దమకు దాఁపునఁ గాంతు రధర్మవర్తనుల్ !!
(2)
కురునృప! పాండునందను లకుంఠిత సత్యపరాక్ర మోన్నతుల్
దురమునఁ గృష్ణు సాయమున దుర్జనులౌ భవదీయ సూనులన్
వరుసగఁ జంపఁ బూని యమ బాధలఁ ద్రోయుచుఁ గాలు పాలికిన్
దరుమగ, నీకుఁ దోడెవఁ? డధర్మ నిఘృష్వము వీడు మిమ్మెయిన్ !
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి