Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, నవంబర్ 27, 2015

సమస్య: భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్

తేది: సెప్టెంబర్ 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




కుక్షింభరి గోవొక వని
నక్షయ ఘాసమునుఁ దినఁగ, నవ్వేళనె హ
ర్యక్ష మొకం డట క్షుథఁ జని,
భక్షించెను గోవుఁ జంపి! పాప మెటు లగున్?


(గోవు తన యాహారమైన ఘాసము నెటుల భక్షించెనో, యటులనే శార్దూలమును తన యాహారమైన గోవునుం జంపి భక్షించుట పాపము కాదుకదా! యని యనుట)



3 కామెంట్‌లు:

  1. నమస్కారాలు సర్...ఈ పూరణము ఏ జాతి కి చెందినదో కొంచెం చెప్పండి

    రిప్లయితొలగించండి
  2. వంశీగారూ! ఇది కందపద్యము. వృత్తములు, జాతులు, ఉపజాతులని పద్యములు మూడు విధములు. దానిలో జాతికి చెందినది ఈ కందపద్యం. స్పందించి వ్యాఖ్య పెట్టినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి