శంకరాభరణంలో నేటి [18-09-2019] సమస్య:
మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే
నా పూరణము:
మృత్స్యందోద్భవ వాపి జీవభృతమై మేల్ముల్ సదా యొప్పఁ ద
న్మత్స్యంబుల్ దిరుగాడ ఖాదకుల కా మత్స్యంబులం బట్టియు
న్మత్స్యందీ నిభ రౌచ్య పచ్య కబళం బందింప నోర్మూసి రీ
మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే!
[మృత్-స్యంద+ఉద్భవ వాపి=భూమినుండి పుట్టిన నీటిబుగ్గచే నేర్పడిన బావి; మత్స్యందీ నిభ=కలకండతో సమానమైన; మౌనులు=చేపల రుచికి నోరు మూసిన ఖాదకులు]
స్వస్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి