Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 05, 2017

గురుదేవులకు నతులు!

మిత్రులందఱకును
గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు!

radha krishnan photo కోసం చిత్ర ఫలితం

చం.
ఇది యొకనాఁటి రాష్ట్రపతి కిష్ట మొసంగిన యట్టి దివ్యమౌ
సుదినము! తత్త్వశాస్త్ర ఘన శోభిత కీర్తి మహత్త్వపూర్ణ స
ద్వదనుఁడు పుట్టినట్టి గురు పర్వదినమ్ము! గురూత్తమాళికిన్
సదమల దివ్య సత్కృతుల సన్నుతు లిచ్చెడి వేళయే కదా!!

ఆ.వె.
చదువు నేర్చుకొనెడి సమయమందునఁ దాను
భోజనమునుఁ గూడ పొందలేక,
యరఁటియాఁకునుఁ గొను నార్థిక స్థితిలేక,
నేల పయినె తాఁ దినెనయ నాఁడు!

ఆ.వె.
శ్రద్ధతోడఁ దానుఁ జదువులు నేర్చియుఁ,
బండితుఁడయి, చదువు బాలకులకు
తత్త్వశాస్త్రబోధఁ దన్మయమ్మునఁజేసి,
వెలిఁగిపోయెనతఁడు పృథివిపయిని!

ఆ.వె.

పాఠ్యబోధనమును బాగైన రీతిలోఁ
గూర్మిమీఱ నేర్పు కోర్కి తోడఁ
బ్రతిదినమ్మునందుఁ బండ్రెండు గంటలు
చదివినాఁడతండు శ్రద్ధగాను!

ఆ.వె.
శ్రద్ధగాను విద్య చాలఁగ నేర్పుచుఁ
బ్రేమఁజూపి మిగులఁ బ్రియతముఁడయె!
బదిలియయ్యుఁ దాను పాఠితులను వీడ,
బండిలాగి ప్రేమఁ బంచిరయ్య!

ఆ.వె.
అంచెలంచెలుగను నభివృద్ధిచెందుచు
రాష్ట్రపతిగనయ్యు రమణమీఱ
నెవ్వరయిన నిటులె యెదిగిపోవుదురని
యెఱుక పఱచెనయ్య హితము మనకు!

ఆ.వె.
అతఁడు పుట్టినట్టి యా జన్మదినమును
శిష్యులంతయును విశిష్టముగను
జరుపుదుమని కోర; జన్మదినమ్మున
గురుదినోత్సవమ్ముఁ గోరె నతఁడు!

ఆ.వె.
అట్టి గురుఁడు పుట్టినట్టి యీ దినమున
గురువులందఱ నిల గుఱుతు సేసి,
పూజ సలుపఁ బొంగిపోయి, బాలలకును
దీవనలను నిడుదు స్థిరముగాను!

స్వస్తి

15 కామెంట్‌లు:

  1. గురువుల గూర్చి చక్కగ చెప్పారు .మీరూ అదే వృత్తి ఎన్నుకుని దానిపై మీ గౌరవం చెప్పకనే చెప్పారు

    రిప్లయితొలగించండి
  2. నేలపయినతాదినెనయనాడు పరిస్థితి కళ్ళకు కట్టారు.
    కాని ధారలో తేడా.మీపద్య రచనా విభవమునకు నమస్కృతులు.గురుదినోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమైన పద్యాలు! అభినందనలు మధుర కవి మిత్రమా!

    రిప్లయితొలగించండి
  4. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    రిప్లయితొలగించండి