Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 06, 2014

దత్తపది: సుయోధనుఁడు-దుశ్శాసనుఁడు-కర్ణుఁడు-శకుని...రామాయణార్థంలో...సీసపద్యం

తేది: సెప్టెంబర్ 06, 2014 నాటి శంకరాభరణంలోని


దత్తపది శీర్షికన ఈయబడిన
సుయోధనుఁడు-దుశ్శాసనుఁడు-కర్ణుఁడు-శకుని
పదముల నుపయోగించి
రామాయణార్థంలో
సీసపద్యం రాయమనగా
నేను రాసిన సీసపద్యము


(విభీషణుఁడు రామునకు రావణుని తెఱం గెఱింగించు సందర్భము)

||సీ||
అష్టదిక్పతుల ననాయాసముగ గెల్చి
స్వఃసుయోధనుఁడుగ సన్నుతిఁ గని,

యెల్లరుఁ దనయాజ్ఞ లెల్లఁ బాలింపంగ
దుశ్శాసనుఁడునయి దోర్బలమున,
దర్పోద్ధతినిఁ బూని తన తమ్ముఁడగు కుంభ
కర్ణుఁడు శ్రేయమ్ముఁ గనుచు నుండ,
మేఘనాదుఁడు సతమ్మింద్రజిన్నాముఁడై
శత్రునాశకునిగ జగతికెక్క,


||గీ||
లంకఁ బాలించుచుండె సల్లక్షణుఁడని
దనుజ బృందమ్ము వొగడంగ దానవేంద్రుఁ
డసుర గణ సేవితుఁడు విదగ్ధ బల వి

రాజితుఁడు శివభక్తుఁడౌ రావణుండు!!


2 కామెంట్‌లు: