తేది: సెప్టెంబర్ 08, 2014 నాటి
శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన సీసపద్యము

||సీ||
శంబరాసురునితో ◊ సమరమ్ముఁ జేయుచోఁ
బతితోడఁ జని, సాయ ◊ పడిన పడతి;
భర్త వరములీయ, ◊ "వలయుచో వేడెద"
నంచు వారించిన ◊ యట్టి సాధ్వి;
పుత్రేష్టి పాయస ◊ మ్మునఁ బాలుపంచియు,
సవతిని మన్నించు ◊ సమరసవతి;
మంథరాబోధిత ◊ మాయాప్రచోదయౌ
పతిమృతిపూర్వ స ◊ త్స్వార్థవనిత;
||గీ||
రాముఁ డారామమునఁ దన ◊ రామతోడ,
సోదరునితోడ నివసింప ◊ నాదరమున
మఱలి, పరిపాలనము సేయు ◊ మనుచు వేడు
దశరథుని పత్ని, భరతుని ◊ తల్లి యామె!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి