శనివారం, డిసెంబర్ 19, 2015
సమస్య: నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!
నెలఁతల సఖ్యత కొఱకయి
లలనా మండలి నొకండు లలి నడుపం దాన్
బొలుపార నగుచుఁ బడఁతులు
నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!
లేబుళ్లు:
సమస్యాపూరణం
గురువారం, డిసెంబర్ 17, 2015
సమస్య: భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!

ఆ సుదక్షిణ దంపతు లార్తితోడ
హరునిఁ బూజింప, భీముండు నపహసించి,
"ఱాయి కాచునే" యని, కత్తి వ్రేయఁ, ద్రిపుర
భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!
లేబుళ్లు:
సమస్యాపూరణం
సోమవారం, డిసెంబర్ 14, 2015
సమస్య: ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!

దానవుండయ్యు ప్రహ్లాదుఁ డనవరతము
హరిని మనమునఁ దలఁచుచు, నర్భకులకుఁ
బరఁగ హరిభక్తిఁ గలిగించె! భక్తిచేత
ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!!
లేబుళ్లు:
సమస్యాపూరణం
శనివారం, డిసెంబర్ 12, 2015
సమస్య: అన్నదానమ్ము సేయువా రధము లిలను!

తనకు మున్నుఁ బుట్టినవాఁడు తన కెవరగు?
క్షేమమునుఁ గూర్పఁ గర్ణుండు నేమి సేయు?
హితముఁ గొని, కీడుఁ జేయువా రెవ్వ రుర్వి?
నన్న, దానమ్ము సేయు, వా రధము లిలను!
లేబుళ్లు:
సమస్యాపూరణం
సోమవారం, డిసెంబర్ 07, 2015
సమస్య: కోడలా నాదు పతి నీకుఁ గొడుకు గాదె!

(సాగరునకు భార్యయైన గంగకుఁ జంద్రుఁడు, శివుఁడు నిద్దఱునుం గొడుకు వరుస యౌదురు. విష్ణు పాదోద్భవయైన గంగ పార్వతికిం గోడలు వరుస కావలెను. ఈ వరుసల ననుసరించి పార్వతి గంగతోఁ జమత్కరించు సందర్భము)
"సాగరున కీవు వలచిన సతివి; మఱియుఁ
జంద్రుఁడే నాకు మఱఁది; యా శంకరునకు
నతఁడు తమ్ముఁడు; విష్ణువౌ నన్న నాకుఁ;
గోడలా! నాదు పతి నీకుఁ గొడుకు గాదె!!"
లేబుళ్లు:
సమస్యాపూరణం
శనివారం, డిసెంబర్ 05, 2015
సమస్య: రాములందు గొప్ప రాముఁ డతఁడు!

నా మొదటి పూరణము:
ఒక సతి యొక మాట యొక బాణ నినదుఁడై
యుండుఁ గాని యొండు నువిదఁ గనఁడు;
రమణిఁ జెఱనుఁ బెట్టు రావణా దీంద్రియా
రాములందు గొప్ప రాముఁ డతఁడు!
*** *** ***

నా రెండవ పూరణము:
పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
మాతృహంత క్షాత్రమార్గోత్సృజులగు నా
రాములందు గొప్ప రాముఁ డతఁడు!!
(ఈ పై పూరణలో అన్వయం బాగా లేనందున, దశరథరాముని ప్రస్తావన లేనందున...
దానిని ఈ క్రింది విధంగా సవరిస్తున్నాను)
సవరించిన పూరణము:
పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
తప్పు లేనివాఁడు దశరథ రాముఁడే!
రాములందు గొప్ప రాముఁ డతఁడు!!
లేబుళ్లు:
సమస్యాపూరణం
బుధవారం, డిసెంబర్ 02, 2015
దత్తపద్యారంభము: "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..."
తేది: సెప్టెంబర్ 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తపద్యారంభము "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..." నను వాక్యమునకు నేను చేసిన పూరణము

మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ మన్మథార్తయై
తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళికిన్!
తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళికిన్!
లేబుళ్లు:
దత్త పద్యారంభము,
పద్య రచన
ఆదివారం, నవంబర్ 29, 2015
సమస్య: వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!
తేది: నవంబర్ 29, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(దేవకీదేవి కన్న యెనమండ్రు సంతానమందు నార్వురనుం గంసుఁడు చంప, సప్తమ గర్భము పతనమై యాదిశేషుని యంశయగు సంకర్షణునిగ [బలరాముఁడు] రోహిణీగర్భగతుఁడాయె, నష్టమ గర్భము శ్రీకృష్ణుఁడని తెలియునది)
తననుఁ జంపెడి శిశువునుఁ దానె చంపఁ
గోరి, దేవకి కన్నట్టి కూర్మి సుతుల
నార్వుర వసుదేవుఁడిడఁగ, నందియుఁ, బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె! (1)
************************************************************
మరణ భయమునఁ గ్రుద్ధుఁడై వరుసఁగఁ బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!
యోగమాయయుఁ దర్జించె "నొక్క బాలుఁ
డంతమొందింప వ్రేపల్లియనుఁ గలఁ" డని! (2)
తననుఁ జంపెడి శిశువునుఁ దానె చంపఁ
గోరి, దేవకి కన్నట్టి కూర్మి సుతుల
నార్వుర వసుదేవుఁడిడఁగ, నందియుఁ, బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె! (1)
************************************************************
మరణ భయమునఁ గ్రుద్ధుఁడై వరుసఁగఁ బ్రతి
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!
యోగమాయయుఁ దర్జించె "నొక్క బాలుఁ
డంతమొందింప వ్రేపల్లియనుఁ గలఁ" డని! (2)
లేబుళ్లు:
సమస్యాపూరణం
శుక్రవారం, నవంబర్ 27, 2015
సమస్య: భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్

కుక్షింభరి గోవొక వని
నక్షయ ఘాసమునుఁ దినఁగ, నవ్వేళనె హ
ర్యక్ష మొకం డట క్షుథఁ జని,
భక్షించెను గోవుఁ జంపి! పాప మెటు లగున్?
నక్షయ ఘాసమునుఁ దినఁగ, నవ్వేళనె హ
ర్యక్ష మొకం డట క్షుథఁ జని,
భక్షించెను గోవుఁ జంపి! పాప మెటు లగున్?
(గోవు తన యాహారమైన ఘాసము నెటుల భక్షించెనో, యటులనే శార్దూలమును తన యాహారమైన గోవునుం జంపి భక్షించుట పాపము కాదుకదా! యని యనుట)
లేబుళ్లు:
సమస్యాపూరణం
సోమవారం, నవంబర్ 16, 2015
సమస్య: కొఱవి తోడనుఁ దలగోకి కొనుట మేలు!

(తన మాట వినక సీతనుఁ జెఱపట్టిన రావణునితో విభీషణుఁడు పలికిన పలుకులు)
"అన్న! వినుమన్న! యిఁకనైన నతివ సీత
నాదరముతోడ నిచ్చి స్నేహమ్మడుగుము!
వానరయుత శ్రీరాముతోఁ బగల కన్నఁ
గొఱవి తోడనుఁ దలగోకి కొనుట మేలు!!"
లేబుళ్లు:
సమస్యాపూరణం
ఆదివారం, నవంబర్ 15, 2015
దత్త పద్యారంభము: కురునృప! పాండునందను లకుంఠిత...
తేది: సెప్టెంబర్ 18, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన "కురునృప పాండునందను లకుంఠిత..." అను పోతన భాగవతం లోని (3-98) పద్య ప్రారంభమును కొనసాగిస్తూ నచ్చిన అంశముతో పద్యమును వ్రాయుమనగా నేను వ్రాసిన రెండు పద్యములు

(1)
కురునృప! పాండునందను లకుంఠిత శౌర్య సుధీ బలాఢ్యులై
నిరుపమ యుద్ధనైపుణిని నీదు సుత ప్రకరమ్ములన్ వడిన్
గరము దురంత దుఃఖ మిడు కయ్యము నందునఁ గూల్చుచుండఁగన్
ద్వరితగతిన్ యమున్ దమకు దాఁపునఁ గాంతు రధర్మవర్తనుల్ !!
(2)
కురునృప! పాండునందను లకుంఠిత సత్యపరాక్ర మోన్నతుల్
దురమునఁ గృష్ణు సాయమున దుర్జనులౌ భవదీయ సూనులన్
వరుసగఁ జంపఁ బూని యమ బాధలఁ ద్రోయుచుఁ గాలు పాలికిన్
దరుమగ, నీకుఁ దోడెవఁ? డధర్మ నిఘృష్వము వీడు మిమ్మెయిన్ !
.
లేబుళ్లు:
దత్త పద్యారంభము,
పద్య రచన
సోమవారం, నవంబర్ 09, 2015
దత్త పద్యారంభము: "ఎందుల కిన్ని బాధల సహింతువు..."
తేది: సెప్టెంబర్ 11, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన పద్య ప్రారంభము "ఎందుల కిన్ని బాధల సహింతువు..." అను వాక్యమునకు కొనసాగింపుగా నేను పూరించిన పద్యము...

(సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)
"ఎందుల కిన్ని బాధల సహింతువు? మద్రసుతా! యముండ
నే!
నిందునిభాస్య! నీ
మగని నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
సందడిఁ జేయుచున్ వెత వసమ్మున వెంటఁ బడంగ రాదు! కొ,
మ్మింద, వరమ్ము
నిత్తు, నిఁక, నీశుని ప్రాణముఁ
దక్కఁ గోరి, యే
కొందలపాటు లేక
యిఁకఁ గూర్చుమ నాకుఁ బ్రమోద మి" ప్డనన్,
ముందుగఁ గోరె
స్వశ్వశురు పూర్వపు వైర్యపహార్య రాజ్యమున్,
సందియ మింక లేక
వరుసన్ గనె మామను లబ్ధచక్షుగన్!
గుందుచు వెన్కఁ
బోవ, హరి గొబ్బున నింకొక
కోర్కెఁ దీర్పఁ, దం
డ్రిం దగఁ బుత్ర
సచ్ఛతునినింగ నొనర్పఁగ, నట్లె రాఁగఁ దాఁ
జిందులు
ద్రొక్కుచున్ "ముదిత! శ్రేష్ఠతమాంచిత సద్వరమ్మునున్
బొందియు వత్తువేల?
యిఁకఁ బోఁగదె!"
యంచు ననంగ, నామెయున్
"ముందుగ రెండు
కోర్కెలిడి ముద్దునుఁ గూర్చితి విప్డు! నీ విఁకన్
వందన మంది, మూఁడవది వద్దనకుండ మహాత్మ, యీయు!" మం
చుం దన కోర్కి
నీయుమన, సూర్యజుఁ డప్పుడు
"సాధ్వి! నేఁడు నా
డెందము సంతసించె!
నిదె డిగ్గన నిచ్చెద! నాథు ప్రాణముల్
వొందఁగఁ గోరఁబోక
మఱి వొందుమ వేఱొక కోర్కి" నన్న నా
ముందఱ
భర్తఁ గాంచియు, యమున్ దగఁ గోరెను "దండపాణి! నా
కుం దగు తోడుఁ
గొంటి! మది కుందె! సుపుత్రుని నా కొసంగియున్
విందునుఁ
గూర్చుమయ్య!" యన, వెంటనె దండి
"తథాఽ"స్తనంగ, నా
నందముతోడ, "సౌరి! యెటు నందెద సంతతి? మానవాంగనల్
వొందెద రెట్లు
సంతతిని వోఢను వీడియు లోకమం?"దనన్,
దొందరపాటుఁ
గన్గొనియు దున్నవయాళికుఁ డంత "సాధ్వి! నీ
సుందర సూక్ష్మ
వాక్ప్రతతిఁ జూడ మహాద్భుతమయ్యె! సంతసం
బందితిఁ! బుత్రపౌత్రయుతవై సుఖియింపుము భర్తతోడ! నే
నుం దగఁ బోయి నా
విధులనుం దగఁ దీర్తు! శుభమ్ము నీ విలన్
బొందు!"మటంచు దీవెనలు పొందుగ నిచ్చి
యగోచరుండయెన్!
జెందొవ చూపు లందముగఁ జిత్రపు నాట్యములాడఁ దాను స్వా
మిం దమితోడఁ జూచుచు గమించిన తత్కథనంత భర్తకున్
సుందరమైన రీతి వినసొంపగునట్లు వచించె! నిర్వురున్
మందగమమ్ములేక కర మందిరి భోగము పూర్వ రీతిగన్!!
-:శుభం భూయాత్:-
లేబుళ్లు:
దత్త పద్యారంభము
బుధవారం, నవంబర్ 04, 2015
సమస్య: రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు!

ప్రణయి రాధకుం గృష్ణుని ♦ వశ్యతఁ గన,
భక్తి నమలిన శృంగార ♦ సక్తత మదిఁ
దనరుచుండెడు సద్భక్త♦జన మనోఽభి
రామునకె చెందు నెల్లప్డు ♦ రాధ వలపు!!
లేబుళ్లు:
సమస్యాపూరణం
మంగళవారం, నవంబర్ 03, 2015
సమస్య: కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!

(భవబంధనము లిఁక వలదని యొక మోక్షకాముకుఁ డనంతుని యందు మనస్సును లగ్నము చేసినవాఁడై ముక్తికాంతనుఁ ద్వరగ రమ్మని పిలుచు సందర్భము)
సుంతయుఁ దాళక భక్తి న
నంతుని పద పద్మ సక్త నత మానస స
చ్చింతను "నో నిశ్శ్రేయస
కాంతా! ర" మ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!!
లేబుళ్లు:
సమస్యాపూరణం
సోమవారం, నవంబర్ 02, 2015
సమస్య: దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె!
(నాస్తికునిగ జీవించి స్వర్గస్థుఁడైన తన పతినిం గూర్చి చింతించుచు నతని ఛాయాచిత్రమునకు నమస్కరించుచుఁ బల్కిన భార్య పలుకులు)
"జనుల సృష్టించి పోషించి సమయఁజేయు
విశ్వవిభు విశ్వసింపక, వెక్కిరించి,
’దేవుఁడే లేఁ’ డనెడువాఁడు, దేవుఁ డయ్యెఁ,
జిత్రపటమునకెక్కి పూజింపఁబడియె!"
లేబుళ్లు:
సమస్యాపూరణం
శనివారం, అక్టోబర్ 31, 2015
సమస్య: ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!

(బాల కృష్ణుని కాళియమర్దన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)
మేనుం గంపన మందఁగఁ
దానా కృష్ణు పద ఘట్టితముల నవయుచున్
దీనుఁడగు కాళియుండను
నేనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్!
లేబుళ్లు:
సమస్యాపూరణం
శుక్రవారం, అక్టోబర్ 30, 2015
సమస్య: పాపకర్ములు దుష్టులు భాగవతులు!
.jpg)
నేరకయె సేసినట్టిడు నీచకృతుల
మథనపడుచును దొసఁగుల మాన్ప మధురి
పు శరణాగతులయి మోక్షము నడిగిరయ
పాపకర్ములు,దుష్టులు,భాగవతులు!
లేబుళ్లు:
సమస్యాపూరణం
సోమవారం, అక్టోబర్ 26, 2015
సమస్య: రోగము లొసంగు జనులకు భోగములను!
తేది: సెప్టెంబర్ 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

"స్వర్గ లోకమ్మునకుఁ జన, ససిగ నప్స
రో గము లొసంగు జనులకు భోగము"లను
కాంక్షతోడుతఁ బుణ్యస క్తాత్ములగుచు
దానము ల్సేయుచుందురు మానవు లిల!
రో గము లొసంగు జనులకు భోగము"లను
కాంక్షతోడుతఁ బుణ్యస క్తాత్ములగుచు
దానము ల్సేయుచుందురు మానవు లిల!
లేబుళ్లు:
సమస్యాపూరణం
ఆదివారం, అక్టోబర్ 25, 2015
సమస్య: కష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!

స్పష్ట ప్రతిభను నభ్యా
సేష్టిని వ్యుత్పత్తితోడఁ జేర్చియు భావా
క్లిష్టతఁ బద్యాల్ సెప్పన్
గష్టం బవధానవిద్య కాదనిరి కవుల్!
లేబుళ్లు:
సమస్యాపూరణం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
