Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మార్చి 19, 2014

సమస్య: కుచముఁ గోసె మగఁడు కూర కొఱకు



తేది: జూలై 29, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నాపూరణము




స్వక రుచ్యము రసమౌటన్,
సకలముఁ దా సిద్ధ పఱచి, సంతోషమునన్
లికుచముఁ గోసె మగఁడు, కూ
ర కొఱకుఁ
 గాకయు, స్వకేష్ట రసముం జేయన్!

(లికుచము=గౙనిమ్మ)

2 కామెంట్‌లు:

  1. మీరు బాగా పద్యాలు రాస్తారు. కానీ మీ ఇంకొక బ్లాగులో నమస్తే తెలంగాణా వార్తల ఆధారంగా కవితలు/పద్యాలు రాస్తారు. ఆ బ్లాగు చూస్తే మీరు పూర్తిగా ఒక వ్యక్తి మాయలో వున్నట్లుగా అనిపిస్తుంది. సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. మీ బొటి వారు ఇంకా దాని గురించే రాసి మనసు ఆవేశపరచుకోవద్దు. మంచి పద్య కళ మీ దగ్గర వుంది. దానితో మీరు సమాజానికి మేలు చేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. అందరమూ ఆ భగవంతుని మాయలోనే ఉన్నాము వృత్తాంతిగారూ! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనిగదా సూక్తి. నా ధర్మము నేను నెరవేర్చాను. మీ అభిప్రాయము మీది. నా అభిప్రాయము నాది. ఇంకను జరుగుతున్న, జరుగబోవుచున్న అన్యాయముల గూర్చి హెచ్చరించుట నా ధర్మము. అది ఆవేశపడుట అని మీరు...కర్తవ్యమని నేను తలంచుట సహజమే. స్పందించి వ్యాఖ్యపెట్టినందులకు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి