Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 27, 2019

కోరికలే ముక్తి కారకములు!



శంకరాభరణంలో నేఁటి (27-06-2019) సమస్య:
జీవా కాంక్షలు ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్

నా పూరణము:
[ఒక భక్తుఁడు తన దైవమునకుఁ జేయునట్టి నివేదనము]

"దేవా! నీ పద సేవఁ జేయు నరుతో దీవ్యత్సఖిత్వంబునున్;
నీవై చేసిన భూతజాలములపై నిర్వ్యాజ దాక్షిణ్యమున్;
భావాతీతవిశిష్టభక్తియుతమై వర్తిల్లు త్వత్పాదరా
జీవాకాంక్షలు, ముక్తికారకములై జేజేల మెప్పొందెడిన్!"


స్వస్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి