శనివారం, డిసెంబర్ 19, 2015

సమస్య: నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!

తేది: సెప్టెంబర్ 25, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




నెలఁతల సఖ్యత కొఱకయి
లలనా మండలి నొకండు లలి నడుపం దాన్
బొలుపార నగుచుఁ బడఁతులు
నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!

1 కామెంట్‌:

  1. నమస్కారం మధుసూదన్ గారు..నాకు ఒక చిన్న సందేహం రామక్రిష్ణ ప్రభ అనే మాస పత్రికలో జనకుడు గీతా సారమును చదివి ఆత్మ జ్ఞానం పొందినాడని వివేకానంద సూక్తి ద్వారా తెలియపరచారు అయితే భగవధ్గీత మహా భారత కాలానికి సంబందించింది కదా రామాయణ కాలానికి సంబందించిన జనకుడు ఎలా గీత చదివి జ్ఞానాన్ని సంపాదించాడు. ఈ కాలానికి చెందిన ప్రశ్నను నాకు కొంచెం వివరించగలరు

    రిప్లయితొలగించండి