శనివారం, జులై 11, 2015
సమస్య: పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్! (2)
తేది:
జూన్ 09, 2015
నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మఱియొక పూరణము
(శ్రీరాముఁడు జనాపవాదభీతిచే సీతాపరిత్యాగముం జేసిన విషయమును యోగదృష్టిచేఁ గనుఁగొనిన వాల్మీకమహాముని తన మనస్సులో ననుకొనిన సందర్భము)
"మతిలేని చాకి వదరఁగ;
మితిలేని వనమ్ములందు మిథిలుని కూఁతున్
గతిలేక విడిచె! నా రఘు
పతి విడనాడిన సతికి, శుభమ్ములు గలుగున్!"
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి