శుక్రవారం, మే 29, 2015

సమస్య: భారతదేశాధిపతి యొబామాయె సుమీ!

తేది: మే 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(ప్రపంచదేశాలలో పేరెన్నిక గనిన నేత యెవ్వరో తెలుపుమని మోడీ, తన కార్యదర్శిని యడుగగా, నతఁడు భారతదేశాధిపతి (ప్రధానమంత్రి) నరేంద్రమోడీకి సమాధాన మిచ్చిన సందర్భము)

"మీరిన యధికారమునన్,
ధారుణి యంతటను గొప్పతనమందుననున్
బేరెన్నికఁ గనిన యతఁడు,
భారతదేశాధిపతి! ’యొబామా’యె సుమీ!"


2 కామెంట్‌లు: