శుక్రవారం, మే 22, 2015

సమస్య: అన్నమొ రామచంద్ర యని యందఱుఁ జచ్చిన రామరాజ్యమే

తేది: ఏప్రిల్ 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




తిన్నగ వానయుం గుఱియదే, యిలఁ బంటలుఁ బండవే హరీ!
సన్నుతిఁ జేసినన్ గనవు, చక్కని పంటల నీయ వేలరా?
యన్నము కోసమై ప్రజలు వ్యాకుల మందుట నీకు న్యాయమే?
"యన్నమొ రామచంద్ర"యని యందఱుఁ జచ్చిన రామరాజ్యమే?

2 కామెంట్‌లు:

  1. "అన్నమో రామచంద్రా!" యని ఎందరు జచ్చిననూ, యది 'రామరాజ్యము' కాదనుకుంటాను గుండు వారు :)

    రిప్లయితొలగించండి
  2. నిజం చెప్పారు కొండల రావు గారూ!

    "అన్నమో రామచంద్రా!" అని అలమటిస్తూ, చస్తుంటే అది రామరాజ్యమెలా అవుతుంది? అందుకే ప్రశ్నార్థకంగా పూరించా నీ సమస్యను!

    స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు! స్వస్తి.

    రిప్లయితొలగించండి