శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

సమస్య: దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా

తేది: నవంబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:





(హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)
"తిరమగు తపమును మెచ్చియు
దురితములనుఁ గనకయే చతుర్ముఖుఁ డటులన్
వరమిడఁ గశిపుఁడుఁ జెలఁగెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"





నా  పై పూరణమునుం గొంచెము మార్చి వ్రాసి, య్తీ దిగువఁ బ్రకటించితిని. గమనింపఁగలరు.

"తిరమగు తపమును మెచ్చియు
హిరణ్య కశిపునకు బ్రహ్మ హితమౌనటులన్
వరమిడ, మన నిటుఁ జెఱచెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"



2 కామెంట్‌లు:

  1. మధుసూదన్ గారూ,
    చాలారోజుల తర్వాత పోస్ట్ పెట్టినట్టున్నారు. సంతోషం.
    మీ పూరణ చాలా బాగున్నది.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు శంకరయ్యగారూ!

    నేను దాదాపుగా 5వ తేదీ నుండి ప్రతిదినమూ పోస్ట్ పెడుతున్నాను. అన్నీ పరిశీలించి, మీ అభిప్రాయం తెలుపగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి