మంగళవారం, సెప్టెంబర్ 09, 2014

సమస్య: చెడుకాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్

తేది: సెప్టెంబర్ 01, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు

(౧)
"గడచిన ప్రభుత్వ మిట్టిది
నడచిరి దుష్టంపుఁ ద్రోవ" నని తిట్టుచునున్
గడపక నవజీవిక ని
చ్చెడుకాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్!
(౨)
కడునిడుములు ముసిరి ముసిరి
తొడరి యుసురు తఱిగి తఱిగి తొలఁగఁగ నున్నన్
దడయక పరమాత్ముని గొ
ల్చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్!
(౩)
మిడిమిడి జ్ఞానముఁ జూపక,
మిడుకక, శత్రులకు బన్న మెన్నఁ డిడక, తా
నొడఁబడి పరహిత మునుఁ గూ
ర్చెడు కాలమె, జనుల కెపుడు సేమముఁ గూర్చున్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి