శనివారం, మే 03, 2014

సమస్య: బావల భుజియించుటే శుభావహ మందున్

తేది: సెప్టెంబర్ 13, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నేను రాసిన మూడు పూరణములు


(1)
(విష్ణ్వాది దేవతాపూజా వ్రతాదుల ననుష్ఠించు దినములం దుపవసించి, తదుపరి దినమున భోజనాదుల స్వీకరించుట సంప్రదాయ మనుట)

భావించియు మావిభు, సం
భావించి యుమావిభుఁ, దదుపరి వాగ్విభు నే
సేవించినట్టి సుదినం
బావల భుజియించుటే శుభావహ మందున్!


(2)
(లేక... ఆ పూజా వ్రతాదులు సంపూర్ణముగ నిర్వర్తించి, యుపవాస దీక్ష విడిచిన తదుపరి భుజించుట సంప్రదాయమనుట)

దేవతల వ్రతము సేయఁగ
నేవిధి యుపవాసముందు రే వారలు? వా
రావిధి తదుపరి సమయం
బావల భుజియించుటే శుభావహ మందున్!



(3)

(పొలము పనులు సేయు కూలీలు మధ్యాహ్న సమయాన భుజించుటకై మా పొలము గట్టునకు రాఁబోఁగా, నా దారిన ముండ్లున్నవని నే నీ విధముగ నందును!)


"రా వలదీ వైపున; కీ
త్రోవను ముండ్లున్న వెన్నొ! తొలఁగఁ గదయ్యా!
పోవయ్య! యీ కుమార్గం
బావల భుజియించుటే శుభావహ" మందున్!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి