బుధవారం, సెప్టెంబర్ 25, 2013

పద్య రచన: కారాగారము



1. కంచెర్ల గోపన్నను సంబోధించుచు....

కారాగారమె గోప
న్నా! రామ సుగుణ విశేష నామ జపముచే
నారామమయ్యెఁ గాదా!
ధీరా! దాశరథి శతక దివ్య కృతీశా! (1)


 2. నెహ్రూను సంస్మరించుచు...
కారాగారస్థుఁడు నె
హ్రూ రచియించె నఁటఁ బెక్కులుగఁ బుస్తకముల్!
కారాగార మనంగ న
పారమయిన బుద్ధికుశల వర్ధిత గృహమే!! (2)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి