సోమవారం, సెప్టెంబర్ 16, 2013

సమస్య: బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్


తులలేని వర విరాజితు
బలగర్వితుఁ బంక్తికంఠుఁ బరిమార్చంగన్
దలఁచిన వానరయుత ధీ
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (1)

ఖలు, విధి వరబల గర్వితు,
నిలా తనయఁ జెఱను నిడిన నీచు, దశాస్యున్,
బొలియింపఁగ, వానర యుత
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (2)

2 కామెంట్‌లు:

  1. మీ బ్లాగు రోజురోజుకు క్రొత్త అందాలను సంతరించుకుంటున్నది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు శంకరయ్యగారూ! తమరి దయ, నా ప్రాప్తం. ఏదో నాకు తోచిన రీతి అలంకరిస్తున్నాను. తమరి అభిమానానికి సంతోషంగా ఉంది.

    రిప్లయితొలగించండి