సమస్య: బలరాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్
తులలేని వర విరాజితు
బలగర్వితుఁ బంక్తికంఠుఁ బరిమార్చంగన్
దలఁచిన వానరయుత ధీ
బల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (1)
ఖలు, విధి వరబల గర్వితు,నిలా తనయఁ జెఱను నిడిన నీచు, దశాస్యున్,బొలియింపఁగ, వానర యుతబల రాముఁడు లంకఁ జేర వారధిఁ గట్టెన్! (2)
మీ బ్లాగు రోజురోజుకు క్రొత్త అందాలను సంతరించుకుంటున్నది. సంతోషం!
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ! తమరి దయ, నా ప్రాప్తం. ఏదో నాకు తోచిన రీతి అలంకరిస్తున్నాను. తమరి అభిమానానికి సంతోషంగా ఉంది.
రిప్లయితొలగించండి