ఆదివారం, ఫిబ్రవరి 21, 2016

మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)

అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 21-02-2016
కవిత సంఖ్య: 324

శీర్షిక:- మాతృభాష [తెలుఁగు] వెలుఁగు (గర్భకవిత్వము)

ద్విపద, మత్తకోకిల, కంద గర్భిత సీసము:

సీసము:
చేతు జోతలు, చేర్చి ♦ శ్రేష్ఠద చిత్తమున్
…..మహి భారతీ! చనె ♦ మాతృభాష
మాత! యాంగ్లమె నేఁడు ♦ మాధ్యమ  మంచు దా
,,,,,నినె నేర్చుచున్ దెలుఁ ♦ గని యనఁగను
రోఁత యంచును దెల్గు ♦ రీతుల రోయుచుం
…..డ్రిట హెచ్చుగా నదె ♦ మృతిఁ గొనెనని
చేత మందున నుల్ల♦సిల్లుట సిగ్గు సి
…..గ్గయ సోదరా యన♦కయ పలువలు

తే.గీ.
తెనుఁగు తొలగగ విడచి; రి♦దె వినసొంపు
గఁ జనెడి తెనుఁగు విడుతురె ♦ కట్ట! యింక
మారుఁడోయయ్య! మనదైన ♦ మాతృభాష
తెలుఁగు వెలుఁగులు లోకాన ♦ నిలుపుఁడయ్య!


ఈ పైన రచించిన సీసమందును…తేటగీతియందును గర్భితమైన పద్యములు ఇవి:

1. ద్విపద
2. మత్తకోకిల
3. కందము

వాటిని వరుసగఁ గ్రింద నిచ్చుచున్నాఁడను. చూడుఁడు:

1. గర్భిత ద్విపద

చేతు జోతలు చేర్చి ♦ శ్రేష్ఠద చిత్త
మాత! యాంగ్లమె నేఁడు ♦ మాధ్యమ మంచు
రోఁత యంచును దెల్గు ♦ రీతుల రోయు
చేత మందున నుల్ల♦సిల్లుట సిగ్గు


2. గర్భిత మత్తకోకిల

చేతు జోతలు చేర్చి శ్రేష్ఠద ♦ చిత్తమున్ మహి భారతీ
మాత! యాంగ్లమె నేఁడు మాధ్యమ ♦ మంచు దానినె నేర్చుచున్
రోఁత యంచును దెల్గు రీతుల ♦ రోయుచుం డ్రిట హెచ్చుగా
చేత మందున నుల్లసిల్లుట ♦ సిగ్గు సిగ్గయ సోదరా


3. గర్భిత కందము

చనె మాతృభాష తెలుఁగని
యనఁగను నదె మృతిఁ గొనె నని ♦ యనకయ పలువల్
తెనుఁగుఁ దొలగగ విడచి; రిదె
వినసొంపుగఁ జనెడి తెనుఁగు ♦ విడుతురె కట్టా!

(మిత్రులందఱకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో)

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్


శనివారం, ఫిబ్రవరి 20, 2016

విష్ణుస్తుతి (గర్భకవిత్వము)



అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 20-02-2016
కవిత సంఖ్య: 323

శీర్షిక:- విష్ణుస్తుతి (గర్భకవిత్వము)

*

నవాక్షర సమవృత్త, కంద త్రయ, మణిగణనికర(శశికళా)వృత్త గర్భిత సరసిజ వృత్తము:

*

సరసిజ వృత్తము:

శ్రీవత్సాంకా! చేతును సేవల్! ♦ శివసఖ! మమతల ♦ సిరు లిడితి వయా
దేవాధీశా! దివ్య గతీవే! ♦ దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
దైవమ్మీవే! ధర్మువు తావై ♦ ధవళిత యశ మిడి ♦ దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ రావా! ♦ ప్రవిమల చరితను ♦ రయముగ నిడుమా!

[లక్షణము: మ-త-య-న-న-న-న-స...గణములుండును...
యతిమైత్రి:1-10-18 యక్షరములకు...
ప్రాసపాటింపఁబడును]


పై సరసిజ వృత్తమునందు....

ఒక నవాక్షర వృత్తము
మూఁడు కందపద్యములు
ఒక మణిగణనికర (శశికళా) వృత్తము

మొత్తము ఐదు పద్యములు ఇమిడియున్నవి....

అవి వరుసగా....


గర్భిత
నవాక్షర వృత్తము:

శ్రీవత్సాంకా! చేతును సేవల్! 
దేవాధీశా! దివ్య గతీవే! 
దైవమ్మీవే! ధర్మువు తావై
రావే యీశా! రక్షగ రావా!
*

గర్భిత
కందము(1)

శ్రీవత్సాంకా! చేతును
సేవల్! శివసఖ! మమతల ♦ సిరు లిడితి వయా!
దేవాధీశా! దివ్య గ
తీవే! దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
*

గర్భిత
కందము(2)

దైవమ్మీవే! ధర్మువు
తావై ధవళిత యశ మిడి ♦ దయను సురవరా!
రావే యీశా! ప్రోవఁగ
రావా! ప్రవిమల చరితను ♦ రయమున నిడుమా!
*

గర్భిత
కందము(3)

శివసఖ! మమతల సిరు లిడి
తివయా! దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
ధవళిత యశ మిడి దయను సు
రవరా! ప్రవిమల చరితను ♦ రయమున నిడుమా!
*

గర్భిత
మణిగణనికర (శశికళా) వృత్తము:

శివసఖ! మమతల ♦ సిరు లిడితి వయా
దివికినిఁ జనఁగను ♦ దెసనిడితివయా!
ధవళిత యశ మిడి ♦ దయను సురవరా!
ప్రవిమల చరితను ♦ రయమున నిడుమా!

[లక్షణము: న-న-న-న-స...గణములుండును.
యతిమైత్రి:1-9 అక్షరములకు.
ప్రాసపాటింపఁబడును]

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్



శుక్రవారం, ఫిబ్రవరి 19, 2016

శివస్తుతి! (గర్భకవిత్వము)



అయుత కవితా యజ్ఞము
Sk-167
గుండు మధుసూదన్
వరంగల్

తేది: 19-02-2016
కవిత సంఖ్య: 322

శీర్షిక:- శివస్తుతి! (గర్భకవిత్వము)

కంద, మధ్యాక్కఱ, తేటగీతి, ద్రుతవిలంబిత వృత్త గర్భిత చంపకమాలా వృత్తము:

హర! శివ! శంకరా! త్రిపుర ♦ హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్
స్మరహర! సంయతా! విపుల! ♦ శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా
వర! భవ నాశకా! విపది ♦ భంగ! వివేకద! విశ్వపాలకా!
వరద! మృడా! ప్రభో! జప త♦పః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!


ఈ చంకపమాల యందు ఇమిడి యున్న పద్యములు:


గర్భిత కందము:

శివ! శంకరా! త్రిపుర హం
త! విధిస్తుత! లింగ! ధీర!♦తత్ స్మరహర! సం
భవ నాశకా! విపది భం
గ! వివేకద!  విశ్వపాల♦కా! వరద! మృడా!


గర్భిత మధ్యాక్కర:

హర! శివ! శంకరా! త్రిపుర ♦ హంత! విధిస్తుత! లింగ!
స్మరహర! సంయతా! విపుల! ♦ శాస్త! కవీశ్వర విశ్వ!
వర! భవ నాశకా! విపది ♦ భంగ! వివేకద! విశ్వ!
వరద! మృడా! ప్రభో! జప త♦పః పరిశాంతిత! శార్ఙ్గి!


గర్భిత తేటగీతి:

త్రిపురహంత! విధిస్తుత! ♦ లింగ! ధీర!
విపుల! శాస్త! కవీశ్వర ♦ విశ్వ! గోత్ర!
విపది భంగ! వివేకద! ♦ విశ్వపాల!
జప తపః పరిశాంతిత! ♦ శార్ఙ్గి! జేత!


గర్భిత ద్రుతవిలంబిత వృత్తము:

త్రిపురహంత! వి♦ధిస్తుత! లింగ! ధీ!
విపుల! శాస్త! క♦వీశ్వర విశ్వ! గో
విపది భంగ! వి♦వేకద! విశ్వపా!
జప తపః పరి♦శాంతిత! శార్ఙ్గి! జే!

-:శుభం భూయాత్:-
******************
సుకవి జన విధేయుఁడు
గుండు మధుసూదన్
వరంగల్

మిత్రులారా! పై "చంపక మాలా వృత్తము"నందు....నాలుగు పద్యములు దాగియున్నవి. అవి: కందము, మధ్యాక్కఱ, తేటగీతి మఱియు ద్రుతవిలంబిత వృత్తము. ఈ నాలుగింటిని చంపకమాల యందు నిమిడ్చి చేయు పద్య రచనమును "గర్భకవిత్వ"మందురు. ఇది చతుర్విధ కవిత్వములలో నొకటి. నేఁడిది స్వల్ప ప్రచారమున నున్నది. దీనిని సంపూర్ణముగ చదివి మీ యభిప్రాయమునుం దప్పక తెలుపఁగలరు.

-గుండు మధుసూదన్