శనివారం, డిసెంబర్ 12, 2015

సమస్య: అన్నదానమ్ము సేయువా రధము లిలను!

తేది: సెప్టెంబర్ 24, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




తనకు మున్నుఁ బుట్టినవాఁడు తన కెవరగు?
క్షేమమునుఁ గూర్పఁ గర్ణుండు నేమి సేయు?
హితముఁ గొని, కీడుఁ జేయువా రెవ్వ రుర్వి?
నన్న, దానమ్ము సేయు, వా రధము లిలను!


2 కామెంట్‌లు:

  1. ఆకటికి వాకిటకు చేరి యడుగు పేద
    కింత పెట్టిన పుణ్యాత్ము లిలను ధన్యు
    లన్నదానమ్ము చేయువా , రధములిలను
    నోటి కాడి కూటిని లాగు కేటు గాళ్ళు .

    రిప్లయితొలగించండి