బుధవారం, జూన్ 03, 2015

సమస్య: సీతను రాముండు దాచి, చిరయశ మందెన్!

తేది: మే 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(హనుమంతుని కోరిక మేరకు శ్రీరాముఁడు సీతతోఁ బాటుగ నతని హృదయమందు వసించెనను సందర్భము)
"తాతా! భక్త జన మనో
నేతా! వసియింపు మెదను నిత్య" మనంగన్,
వాతాత్మజు నెదఁ దననున్
సీతను రాముండు దాచి, చిరయశ మందెన్!

2 కామెంట్‌లు: