శుక్రవారం, జూన్ 19, 2015

సమస్య: కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము!

తేది: మే 23, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




(బడికి నెగఁగొట్టనెంచి కడుపునొప్పి బాధనభినయించిన బాలుని యుదంతము)


ఇంటిపనినిఁ జేయ నొంటికిఁ బడక, తా
బడికి నేఁగ ననక, బాలుఁ డపుడు
"కడుపునొప్పి"యనఁగ, బడిమాన్ప, ముదమయ్యెఁ!
గడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము!!



2 కామెంట్‌లు:

  1. ఎంతైనా ఉపాధ్యాయులు కదా! బడిదొంగల కడుపునొప్పి సంగతి మీకు (నాకుకూడ) బాగా తెలుసు. మంచి పూరణ... అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు శంకరయ్యగారూ! ప్రతిదినమూ ఎంతమందిని చూస్తున్నాము ఇలాంటివారిని! స్పందన వారే అందించారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి