సోమవారం, మే 25, 2015

న్యస్తాక్షరి: ప్రతిపాదం మొదటి అక్షరాలు వరుసగా: భూ-కం-ప-ము...తేటగీతి పద్యంలో...భూకంపవర్ణన...

తేది: ఏప్రిల్ 29, 2015 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- భూకంపము.

ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘భూ - కం - ప - ము’ ఉండాలనగా

నేను వ్రాసిన రెండు తేటగీతులు


image of nepal earthquake కోసం చిత్ర ఫలితంimage of nepal earthquake కోసం చిత్ర ఫలితంimage of nepal earthquake కోసం చిత్ర ఫలితంimage of nepal earthquake కోసం చిత్ర ఫలితం



మొదటి పూరణము:
భూనభో౽౦తరమధ్యమ్ము భోరుమనెడి
కంపనోద్భూత విలయ సంఘట్టనములు
పల్లెలం బట్టణమ్ములఁ బగులఁ జీల్చి,
ముప్పుఁగలిగించె నేపాళభూమికకట!




రెండవ పూరణము:
భూమిజనదుష్కృతోద్ధృతస్ఫోటజనిత
కంపితోద్విగ్ననేపాళఘనచరిత్ర
పతనమాయెను భూకంప భండనమున!
ముక్తజీవావసధులైరి భూమిజనులు!!



2 కామెంట్‌లు: