tag:blogger.com,1999:blog-8055681943289831802.post5060952436584089306..comments2024-01-11T14:35:26.010+05:30Comments on మధుర కవనం: అమ్మా! ఆదిపరాశక్తీ! శాంకరీ! నమోఽస్తు తే!మధురకవి గుండు మధుసూదన్http://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8055681943289831802.post-14066020407655442032015-10-17T20:34:25.984+05:302015-10-17T20:34:25.984+05:30సత్తిరెడ్డిగారూ, నమస్కారములు!
మీ రడిగిన సందేహములక...సత్తిరెడ్డిగారూ, నమస్కారములు!

మీ రడిగిన సందేహములకు నా సమాధానములు నాకు తెలిసినంత వరకు తెలియజేస్తున్నాను.

1) శివతాండవ సమయంలో శివుని కుడి పాదము క్రింద ఉన్నది అపస్మార పురుషుడు (ములయకుడు/మూలయకుడు అను పేరు గల రాక్షసుడు...అని చాగంటివారు చెప్పిన జ్ఞాపకం). ఇలా చేయడం అజ్ఞాన నాశనమునకు సంకేతమంటారు. ఎడమ చేయి, ఎడమపాదం పైకెత్తి ఉండడం ముక్తి హేతుత్వమును సూచిస్తుందంటారు. అసలు ఈ శివతాండవం అనేక ముద్రల సమాహారం. ప్రతి ముద్రకూ సంకేతార్థం ఉంటుంది.

2) విష్ణువును దామోదరుడంటారు. అంటే (i) ఉదరంపై దామం గలవాడని అర్థం. ఈ దామాన్ని (పూలదండను) ఎప్పటికీ ధరించే ఉంటాడు విష్ణువు. (ii)మరో విశేషం ఏమంటే...దామోదరుడు అనే పదానికి దామ+ఉత్+అరః - దామోదరః - అంటే, దమాదులచే ఉత్తమమైన బుద్ధికి విషయమగువాడు.(దమమంటే అంతరింద్రియ నిగ్రహం).
ఈ విషయాన్నిగూర్చి ప్రస్తావిస్తూ ఆంధ్ర నాయక శతక కర్త యైన కాసుల పురుషోత్తమ కవి... "మొదటినుండియు నీవు దామోదరుడవె" అంటాడు వ్యాజస్తుతిలో..!
సమర్ధమైన భార్య ఇల్లు దిద్దుతూ ఉంటే, కీర్తి ఆ ఇంటి యజమానికి లభిస్తుంది.
భార్య భూదేవి భూభారం వహిస్తుంటే భగవంతుడు "అఖిల భారకుడు"అనే పేరు వహిస్తున్నాడు. కష్టమొకరిది. ఖ్యాతి వేరొకరిది..
ఐశ్వర్యవంతురాలు భార్య అయితే ఇంట్లో లక్ష్మి కళ కళ లాడుతుంది. ఇక ఇందిరే భార్య ఐతే ఇందిరా రమణుడు "కామితార్ధదుడు" కావడంలో విశేషమేముంది?
సమర్ధుడు కొడుకైతే,కుటుంబం వృద్ధి పొందుతుంది.ఇక బ్రహ్మ గారే,కుమారుడైతే, కుటుంబమంతా తామర తంపరలా వర్ధిల్లుతుంది. అప్పుడు తండ్రికి బహు కుటుంబ భారకుడు అని పేరు వచ్చింది.
పవిత్రమైన చరిత్ర కలిగిన కూతురు "కలుష విధ్వంసిని" యైన గంగ వల్ల విష్ణు మూర్తికి "పతిత పావనుడు" అనే ప్రతిభ వచ్చింది.
కుటుంబ యజమానికి ఆలు బిడ్డలే ప్ర్యఖ్యాతి సమకూరుస్తున్నారు. నీకు ప్రత్యేక ప్రఖ్యాతి ఏంలేదు కాబట్టి నిజంగా నువ్వు నిష్ప్రయోజకుడవే...ఉదరంపై దామం కదలాడుతుండగా తిరిగేవాడవే...అనగా... "దామోదరుడవే" అంటాడు.
ఈ పద్యానికి అందమిచ్చిన పదం ఈ "దామోదరుడు".

నిజానికి లోకంలో వాడుకలో దరిద్రుణ్ణి దామోదరుడని మృదూక్తిగా తెలుగు ప్రజలంటారు. కానీ నిఘంటువులు మాత్రం ఈ అర్ధాన్ని గుర్తించలేదు. దారిద్ర్యం దహిస్తున్నా ఓర్పుతో నిగ్రహించుకొని ఉండేవాడు కాబట్టి దరిద్రుణ్ణి దామోదరుడంటారు.అంచేత పురుషోత్తమ కవి కేవలం కోశాన్నే కాకుండా దేశాన్ని కూడా బాగా చూసిన వాడు కాబట్టి ఇలాంటి పద ప్రయోగం చేశాడు. సంస్కృతాంధ్ర భాషల్లో గల రెండర్ధాలు ఈ పదంలో ముడి పడడం చేత యెంతో అందగించింది. ఇంత అర్ధముంది "దామోదర" పదంలో.

సమాధానం లభించిందనుకుంటాను....నమస్తే!

స్వస్తి.
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-8055681943289831802.post-43862077870738622672015-10-17T18:12:11.738+05:302015-10-17T18:12:11.738+05:30మధుసూధన్ గారు నమస్కారములు. రాభోయె విజయ ధశమి పర్వ మ...మధుసూధన్ గారు నమస్కారములు. రాభోయె విజయ ధశమి పర్వ ముంధస్తు శుభాకాంక్షలు. మాకు రెండు సందేహములు ఉన్నవి. వాటిని నివృత్తి చేయగలరు.
1)శివుడు తాండవం చేసిన సంధర్బాన అతని ఒక పాదము కింధ ఉన్న వ్యక్తి ఎవరు?
2)విష్ణువుని దామోధరుదు అని అంటారు.ధీనికి ఒక అర్ధము ధరిధ్రుదు అని ఉన్నధి కధ. మరి విష్ణువు దరిద్రుడు ఎలా అవుతాడు?
ధయచేసి సమాధానమును తెలియ ఛేయ గలరు.
ధన్యవాధములు.Anonymousnoreply@blogger.com